Bible reader



రూతు

గ్రంథకర్త

రూతు గ్రంథంలో ప్రత్యేకంగా గ్రంథకర్త పేరు లేదు. సంప్రదాయ గాధనను గురించి సమూయేలు ప్రవక్త దీన్ని రాశాడు. ఏ కాలానికెనా ఇంత కన్నా మంచి కథానిక మరొకటి లేదని అంటారు. గ్రంథంలో చివరి మాటలు రూతుకు ఆమె ముని మనమడు దావీదుకు (రూతు 4:17-22) ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నది. కాబట్టి దావీదును రాజుగా అభిషేకించిన తరువాత గ్రంథరచన జరిగిందన్నది స్పష్టం.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 1100 - 930

మధ్యకాలం రూతు గ్రంథంలో వర్ణించిన సంభవాలు ఇశ్రాయేలియులు ఈజిప్టునుంచి బయటికి వచ్చిన కాలంతో ముడిపడి ఉన్నాయి. ఎదుకంటే రూతులోని విషయాలు న్యాయాధిపతుల కాలానికి, న్యాయాధిపతుల కాలం కనాను ఆక్రమణకీ సంబంధించి ఉన్నాయి.

స్వీకర్త

రూతు గ్రంథం ప్రథమ పాఠకులెవరో స్పష్టంగా తెలియదు. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు ఒకటిలో ఒకటి కలిసి ఉన్న కాలంలో ఈ పుస్తకం రాశారు. ఎందుకంటే 4:22 లో దావీదు ప్రస్తావన ఉంది.

ప్రయోజనం

విధేయత తీసుకువచ్చే ఆశీర్వాదాలను రూతు గ్రంథం చూపిస్తుంది. దేవుని ప్రేమపూర్వకమైన విశ్వసనీయమైన స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. దేవుడు తన ప్రజల మొరకు స్పందిస్తాడని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. తాను బోధించిన దానే ఆయన పాటిస్తాడు. ఎలాటి ఆధారం లేని ఇద్దరు వితంతువులకు ఆయన పోషణ నివ్వటం చూస్తే సమాజంలో వెలివేతకు గురి అయిన వారి పట్ల ఆయన శ్రద్ధ వహిస్తాడనీ (యిర్మీయా 22:16; యాకొబు 1:27) మనమూ అదే చేయాలని మనకు చెబుతున్నాడు.

ముఖ్యాంశం

విమోచన

విభాగాలు

నయోమి కుటుంబ విషాదంలో పడిపోయారు — 1:1-22

2. నయోమి దగ్గర బంధువు బోయజును రూతు కలుసుకోవటం అతని పొలంలో పరిగె ఎరుకోవడం — 2:1-23

3. బోయజు దగ్గరికి వెళ్ళమని నయోమి రూతుకు చెప్పడం — 3:1-18

4. రూతుకు విమోచన, నయోమికి పూర్వక్షేమ స్థితి కలగటం — 4:1-22