Bible reader



120

యాత్రల కీర్తన

1నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు.

2యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.

3మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?

4తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.

5అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను.

6విరోధుల మధ్య నేను చాలాకాలం నుండి నివసిస్తున్నాను.

7నాకు కావలసింది శాంతి సమాధానాలే. అయినా నా నోటి వెంట మాట రాగానే వాళ్ళు నాతో యుద్ధానికి సిద్ధమవుతారు.