Bible reader



హెబ్రీయులకు రాసిన పత్రిక

గ్రంథకర్త

పత్రిక రచయిత ఎవరు అన్నది ప్రశ్నార్ధకంగా ఉండిపోయింది. కొందరు పండితులు దీన్ని రాసింది పౌలు అన్నారు. అయితే అసలైన రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు. క్రైస్తవానికి ప్రధాన యాజకునిగా ఇంట బాగా మరి ఏ ఇతర పుస్తకం కూడా వర్ణించలేదు. ఈయనది ఆహారోను యాజకత్వం కన్నా మిన్న. ఈయనే ధర్మశాస్త్రం, ప్రవక్తలకు నెరవేర్పు. క్రీస్తును మన విశ్వాసానికి కర్త, కొనసాగించే వాడుగా ఈ పుస్తకం చూపెడుతున్నది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. శ. 65 - 70

దీన్ని యెరూషలేములో రాశారు. క్రీస్తు ఆరోహణం, యెరూషలేము నాశనం మధ్య కాలంలో రచన జరిగింది.

స్వీకర్త

ఈ పుస్తకం పాత నిబంధన లేఖనాలతో పరిచయం ఉన్న యూదు విశ్వాసుల కోసం. వీరు ఆ సమయంలో తిరిగి యూదు మతానికి వెళ్ళిపోవడం, లేక సువార్తకు యూదు మతం రంగు పులమడం అనే శోధన కింద ఉన్నారు. ఇంకా క్రీస్తు విశ్వాసంలోకి వచ్చిన అనేక మంది యాజకుల కోసం రాసినది అని కూడా అంటారు (అపో. కా. 6:7).

ప్రయోజనం

స్థానిక యూదు ప్రబోధాలను తిరస్కరించాలని రచయిత పురిగొల్పుతున్నాడు. వారు యేసుకు కట్టుబడి ఉండాలి. ఆయనే అందరికన్నా శ్రేష్టుడు. దైవ కుమారుడు దేవా దూతలకన్నా యాజకులకన్నా పాత నిబంధన నాయకుల కన్నా ఏ మతం కన్నా కూడా అధికుడు. సిలువపై మరణించి, తిరిగి లేవడం ద్వారా అయన విశ్వాసులకు నిత్య జీవం, రక్షణ ఇస్తున్నాడు. మన పాపాలకోసం క్రీస్తు బలి పరిపూర్ణం. విశ్వాసం అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. దేవునికి లోబడడం ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడిస్తాము.

ముఖ్యాంశం

క్రీస్తు ఆధిక్యత

విభాగాలు

1. యేసు క్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు — 1:1-2:18

2. ధర్మ శాస్త్రం, పాత నిబంధన కంటే యేసు క్రీస్తు గొప్పవాడు — 3:1-10:18

3. బాధల్లో నమ్మకంగా నిలకడగా ఉండాలని పిలుపు — 10:19-12:29

4. చివరి హెచ్చరికలు, అభివాదాలు — 13:1-25