Bible reader



హబక్కూకు

గ్రంథకర్త

హబక్కూకు 1:1 ప్రకారం ఇది హబక్కూకు ప్రవక్త దేవోక్తులు రాసిపెట్టిన పుస్తకం. ఈ పేరు తప్పించి హబక్కూకు గురించి అదనంగా వివరాలేవీ తెలియవు. “హబక్కూకు ప్రవక్త” అని రాసి ఉన్న దాన్నిబట్టి ఇతడు మొత్తం మీద అందరికీ పరిచయస్తుడేననీ, ప్రత్యేకించి వివరించవలసిన పని లేదనీ అర్ధం చేసుకోవచ్చు.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 625 - 580

దక్షిణ యూదా రాజ్య పతనానికి కొద్దిగా ముందు హబక్కూకు ఈ పుస్తకం రాసి ఉండవచ్చు.

స్వీకర్త

దక్షిణ యూదా సామ్రాజ్య ప్రజానీకం. అంతటా ఉన్న దేవుని ప్రజలు.

ప్రయోజనం

దేవుడు ఎన్నుకొన్న ప్రజలు ప్రస్తుతం తమ శత్రువుల చేతిలో బాధల పాలు కావడం ఎందుకని హబక్కూకు విశ్వాసం మరలా కుదుటబడింది. తన ప్రజల సంరక్షకుడుగా యావే తనపై ఆనుకున్న వారిని ఆదుకుంటాడు. రాజ్యపు సార్వభౌమిక వీరుడుగా యావే ఒక నాడు అక్రమకారులైన బబులోను వారిని శిక్షిస్తాడు. గర్విష్టులైన ప్రజలు కాళ్ళబేరానికి రావడం, న్యాయవంతులు దేవునిపై విశ్వాసం మూలంగానే జీవిస్తారు అనేది రుజువు కావడం ఈ పుస్తక ప్రయోజనం (2:4).

ముఖ్యాంశం

సార్వభౌమిక ప్రభువుపై నమ్మకం.

విభాగాలు

1. హబక్కూకు ఫిర్యాదులు — 1:1-2:20

2. హబక్కూకు ప్రార్ధన — 3:1-19