ఆదికాండం
గ్రంథకర్త
యూదు సంప్రదాయం, ఇతర బైబిల్ రచయితలు మొత్తం పాతనిబంధన పంచకాండాల రచయితగా ప్రవక్త, ఇశ్రాయేలు విమోచకుడు అయిన మోషేను పేర్కొన్నారు. ఈజిప్టు ఆస్థానంలో అతని విద్యాభ్యాసం (అపో. కా. 7:22), యెహోవాతో అతని సన్నిహిత సంబంధం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. యేసే స్వయంగా మోషే గ్రంథ కర్తృత్వాన్ని నిర్ధారించాడు (యోహాను 5:45-47). అయన కాలంలోని శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఈ దీనికి సమ్మతించారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 1450 - 1410
ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్య ప్రాంతంలో గడిపిన సంవత్సరంలో మోషే ఈ గ్రంథం రాశాడని చెప్పవచ్చు.
స్వీకర్త
ఈజిప్టు బానిసత్వం నుండి విడుదలై వాగ్దాన దేశం కనానుకు చేరుకొనక ముందు ఆనాటి ఇశ్రాయేలీయులు.
ప్రయోజనం
వారి జాతి “వంశవృక్షం” వారికి వివరించడానికి మోషే ఈ గ్రంథం రాశాడు. ఈ గ్రంథం రాయడంలో మోషే ఉద్దేశం ఇశ్రాయేలీయులు బానిసత్వంలోకి ఎలా వెళ్లారు (1:8), తమ వాగ్దాన భూమిలో ఎందుకు ప్రవేశించబోతున్నారు (17:8) అనేది వివరించి, ఇశ్రాయేలీయులుకు జరిగినవన్నీ దేవుని సర్వభౌమిక సంకల్పం ప్రకారమే జరిగాయని చెప్పడమే. ఈజిప్టులో వారి బానిసత్వం యాదృచ్చికంగా జరిగినది కాదనీ అది దేవుని విస్తృత ప్రణాళికలో భాగమనీ (15:13-16; 50:20) చెప్పడమే. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రపంచాన్ని చేసిన సృష్టికర్త అనీ (3:15-16) వివరించడమే. ఇశ్రాయేలీయుల దేవుడు కేవలం అనేకమంది దేవుళ్లలో ఒకడు కాదు, అయన ఆకాశాలను, భూమినీ చేసిన దేవాదిదేవుడు.
ముఖ్యాంశం
అరంభాలు
విభాగాలు
1. సృష్టి — 1:1-2:25
2. మానవ పాపం — 3:1-24
3. ఆదాము తరాలు — 4:1-6:8
4. నోవహు వంశావళి — 6:9-11:32
5. అబ్రాహాము చరిత్ర — 12:1-25:18
6. ఇస్సాకు, అతని కొడుకుల చరిత్ర — 25:19-36:43
7. యోసేపు తరాలు — 37:1-50:26
