Bible reader



ద్వితీయోపదేశ కాండము

గ్రంథకర్త

ఈ గ్రంథాన్ని మోషే రాసాడు. నిజానికి ఇది ప్రజల యొర్దాను దాటక ముందు అతడు వారికి చేసిన ఉపన్యాసాల సంకలనం. మోషే ఇశ్రాయేలీయులతో చెప్పిన మాటలు ఇవే. (1:1). వేరొకరు, బహుశా యెహోషువ, చివరి అధ్యాయం రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం లోనే అధిక భాగం మోషే రాశాడని ఉంది. (1:1, 5; 31:24). గ్రంథరచన సమయంలో మోషే, ఇశ్రాయేలీయులు మోయాబు మైదాన ప్రాంతంలో యొర్దాను నది మృత సముద్రంలో కలిసే చోట శిబిరం వేసుకున్నారు (1:5). ద్వితీయోపదేశం అంటే రెండవ ధర్మశాస్త్రం. దేవునికి, ఆయన ప్రజలైన ఇశ్రాయేల్ కీ మధ్య ఉన్న నిబంధనను మరొక సారి చెప్పడం ఇక్కడ ఉంది.

రచనా కాలం, ప్రదేశం

ఇంచుమించు క్రీ. పూ. 1445 - 1400

ఇశ్రాయేల్ వాగ్దానదేశంలో ప్రవేశించక ముందు 40 దినాల్లో ఈ గ్రంథ రచన జరిగింది.

స్వీకర్త

వాగ్దాన దేశం ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేల్ కొత్త తరం. వారి తండ్రులు ఈజిప్టు బానిసత్వం నుండి విడుదలైన 40 సంవత్సరాలకు వారికి ఇచ్చిన సందేశం. ఆ తరువాత బైబిలు చదివే వారందరికి కూడా.

ప్రయోజనం

ఇది జాతికి మోషే ఇచ్చిన వీడ్కోలు సందేశం. ఈజిప్టునుంచి బయటికి వచ్చిన 40 సంవత్సరాలకు ఆ జాతి యొర్దాను నది దాటి కనానును ఆక్రమించుకోబోతున్నది. అయితే మోషే ఇక తనువు చాలించనున్నాడు. అతడు వాగ్దానదేశంలో ప్రవేశించడు. మోషే ఇచ్చిన వీడ్కోలు సందేశం ఆ జాతి దేవుని ఆజ్ఞలను పాటించాలనే హృదయపూర్వకమైన పిలుపు. కొత్త దేశంలో వారికి క్షేమం కలగాలంటే ఇలా చేయాలి. (6:1-3, 17-19). ఈ ఉపన్యాసాలు వారి దేవుడు ఎవరో వారికి జ్ఞాపకం చేశాయి (6:4). ఆయన వారి కోసం ఏమి చేశాడో (6:10-12, 20-23) తెలిపాయి. వారు ఈ ఆదేశాలను తమ మరుసటి తరానికి చెప్పాలని మోషే వారిని హెచ్చరించాడు. (6:6-9).

ముఖ్యాంశం

విధేయత

విభాగాలు

1. ఈజిప్టు నుండి ఇశ్రాయేల్ వారి ప్రయాణం — 1:1-3:29

2. దేవునితో ఇశ్రాయేల్ సంబంధం — 4:1-5:33

3. దేవుని పట్ల స్వామిభక్తి ప్రాముఖ్యత — 6:1-11:32.

4. దేవుని ప్రేమ మరియు అతని ఆజ్ఞలను గైకొనుము — 12:1-26:19

5. దీవెనలు, శాపాలు — 27:1-30:20.

6. మోషే మరణం — 31:1-34:12