Bible reader



ఆమోసు

గ్రంథకర్త

1:1 ప్రకారం దీని రచయిత ఆమోసు ప్రవక్త. ఇతడు తెకోవ అనే ఊరిలో కొందరు కాపరులు మధ్య నివసించాడు. తన రచనలో అతడు తాను ప్రవక్తల కుటుంబం వాడు కాడని స్పస్టం చేశాడు. తనను తాను ఒక ప్రవక్తగా అతడు ఎంచుకోలేదు. దేవుడు విడుదల ద్వారా తీర్పు పంపుతాడని హెచ్చరించాడు. అయితే ఆమోసు ప్రార్దన ఇశ్రాయేలు కాపాడింది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 760 - 740

ఆమోసు బేతేలు, సమరయ ప్రాంతాల్లో ప్రవచించాడు. ఇవి ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నాయి.

స్వీకర్త

ఇశ్రాయేలు ఉత్తర రాజ్య ప్రజానీకం. భావికాలంలో బైబిలు చదవ నున్న వారంతా.

ప్రయోజనం

అహంకారం అంటే దేవునికి గిట్టదు. తమకు ఎవరి తోడు అక్కర లేదని ప్రజలు అనుకొని విర్రవీగుతున్నారు. అన్నీ దేవుని నుండే వస్తాయని వారు మర్చిపోయారు. దేవునికి మనుషులంతా ఇష్టమే. పేదలను పీడించే వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు. చివరగా దేవుడు యధార్దమైన ఆరాధన కోరుతున్నాడు. అంతేగాక తనకు గౌరవించే ప్రవర్తన కోరుతున్నాడు. ఆమోసు ద్వారా దేవుని సందేశం ఇశ్రాయేలు సంపన్నుల కోసం వస్తున్నది. వీరికి తమ సాటి మనుషులంటే ప్రేమ లేదు. ఇతరుల బలహీనతను ఆసరాగా తీసుకొని వారిని దోచుకుంటారు. వారు తమ స్వార్థమే ఆలోచిస్తుంటారు.

ముఖ్యాంశం

తీర్పు

విభాగాలు

1. జాతుల వినాశనం — 1:1-2:16

2. ప్రవక్తగా పిలుపు — 3:1-8

3. ఇశ్రాయేల్ పై తీర్పు — 3:9-9:10

4. పూర్వక్షేమస్ధితి — 9:11-15