Bible reader



తిమోతికి రాసిన మొదటి పత్రిక

గ్రంథకర్త

ఈ పత్రిక రచయిత పౌలు. తిమోతి పత్రికల్లో వీటిని రాసింది అపోస్తలుడు పౌలు అని స్పష్టంగా కనిపిస్తుంది. “దేవుని చిత్తము చొప్పున క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు” (1:1). అది సంఘం ఈ ఉత్తరం పౌలు రచన అని స్పష్టంగా అంగీకరించింది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. శ. 62 - 66

పౌలు తిమోతి ని ఎఫేసులో ఉంచి, మాసిడోనియాకు వెళ్ళాడు. అక్కడ నుంచి ఈ లేఖ రాశాడు (1:3; 3:14, 15).

స్వీకర్త

ఈ పత్రికను తిమోతికి రాశాడు గనక ఈ పేరు స్థిరపడింది. తిమోతి పౌలుతో కలిసి ప్రయాణాలు చేశాడు. అతని సువార్త యాత్రల్లో అతని సహాయకుడుగా ఉన్నాడు. తిమోతి, సంఘం కూడా ఈ పత్రిక గ్రహీతలు.

ప్రయోజనం

దేవుని ఇల్లు ఎలాటి క్రమంలో నడవాలో తిమోతికి వివరించడం పత్రిక లక్ష్యం (3:14-15). తిమోతి ఈ సూచనలను నిష్ఠగా పాటించాలని అతనికి హెచ్చరిక. ఈ వచనాలు ఈ పత్రిక విషయంలో పౌలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి, “సజీవుడైన దేవుని సంఘంలో అయిన సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో తెలిపేటందుకు” ఈ పత్రిక పౌలు రాశాడు. ఎందుకంటే ఆ సంఘం సత్యానికి స్థంభం, పునాది. సంఘాలను కట్టడం, అభివృద్ధి పరచడం ఎలానో పౌలు తన సహచరులకు సూచనలివ్వడం ఇక్కడ కనిపిస్తుంది.

ముఖ్యాంశం

యువ శిష్యునికి సూచనలు

విభాగాలు

1. పరిచర్య పధ్ధతులు — 1:1-20

2. పరిచర్య సూత్రాలు — 2:1-3:16

3. పరిచర్యలో బాధ్యతలు — 4:1-6:21