Bible reader



1 రాజులు

గ్రంథకర్త

1 రాజులు గ్రంథ రచయిత ఎవరో ఎవరికీ తేలియదు. కొందరు వాఖ్యాతలు ఎజ్రా, యెహెజ్కేలు, యిర్మీయాలను రచయితలుగా సుచించారు. ఎందుకంటే ఇందులోని చరిత్ర మొత్తం 400 సంవత్సరాలు పటింది. ఈ గ్రంథంలోని విషయాలను రాయడానికి అనేక మూలాలు నుండి సమాచారం సేకరించవలసి వచ్చింది. సాహిత్య శైలి, గ్రంథమంతటా విస్తరించి ఉన్న అంశాలు, అందుబాటులోకి వచ్చిన కథనాలు మొదలైన వాటిని బట్టి చూస్తే ఎక్కువ మంది రచయితల కంటే ఒకడే రచయిత ఈ గ్రంథాన్ని కూర్చి ఉండవచ్చునని అర్ధమవుతున్నది.

రచనా కాలం, ప్రదేశం

సూమారు క్రీ. పూ. 561 - 538

రాసే నాటికీ మొదటి ఆలయం ఇంక ధ్వంసం కాలేదు. (1 రాజులు 8:8).

స్వీకర్త

ఇశ్రాయేల్ ప్రజలు, బైబిల్ పాఠకులందరూ.

ప్రయోజనం

1, 2 సమూయేలు గ్రంథాల కొనసాగింపు ఈ పుస్తకం. దావీదు మరణం తరువాత సొలొమోను రాజు కావడంతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఐక్యసామ్రాజ్యం రాజ్యం రెండుగా, అంటే యూదా, ఇశ్రాయేల్ రాజ్యాలుగా విడిపోవడంతో కథనం ముగుస్తుంది. హీబ్రూ బైబిల్లో 1, 2 రాజులు గ్రంథాలు ఒకటే గ్రంథం.

ముఖ్యాంశం

చెల్లాచెదరు

విభాగాలు

1. సొలొమోను పరిపాలన — 1:1-11:43

2. రాజ్యం రెండుగా చీలిపోవడం — 12:1-16:34

3. ఏలీయా, ఆహాబు — 17:1-22:53